తెలంగాణ

telangana

By

Published : May 17, 2019, 5:03 PM IST

Updated : May 17, 2019, 5:25 PM IST

ETV Bharat / elections

సార్వత్రిక ప్రచారం సమాప్తం- 19న తుది దశ

సార్వత్రిక సమరం తుది దశకు చేరుకుంది. మే 19న చివరి విడత పోలింగ్ జరగనున్న​ నియోజకవర్గాల్లో నేటితో ప్రచారానికి తెరపడింది. 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 లోక్​సభ స్థానాలకు ఆదివారం ఓటింగ్ జరగనుంది.

ఏడో దశ

ఏడో విడతకు ముగిసిన ప్రచారం

సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంది. ఏడో విడత పోలింగ్​తో ఫలితాలు మినహా ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లే. ఆదివారం 59 లోక్​సభ స్థానాలకు పోలింగ్​ జరగనుంది. మొత్తం 10 కోట్ల 10లక్షల మంది ఓటర్లు 918 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.

ఏడో విడత వివరాలు

బంగాల్​లోని 9 నియోజకవర్గాల పరిధిలో 20 గంటల ముందుగానే ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది.

ఏడో విడత వివరాలు

పటిష్ఠ భద్రత

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బంగాల్​లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం.

ఇదీ చూడండి: భారత్​ భేరి: ప్రజలు కాదు... 'పొత్తులే' నిర్ణేతలు!

Last Updated : May 17, 2019, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details