తెలంగాణ

telangana

ETV Bharat / elections

ఎన్నికల భారతంలో ఎన్నెన్ని సిత్రాలో..!

1951-2019...! భారత దేశ ఎన్నికల ప్రక్రియది సుదీర్ఘ ప్రస్థానం. మధ్యలో ఎన్నో మార్పులు. అన్నింటి లక్ష్యం ఒకటే... ఓటింగ్​ను మరింత సులభతరంగా, పారదర్శకంగా నిర్వహించడం. అలా వచ్చిన మార్పులకు అద్దంపట్టే అరుదైన చిత్రాలు మీకోసం...

ఎన్నికల భారతంలో ఎన్నెన్ని సిత్రాలో..!

By

Published : Apr 10, 2019, 1:30 PM IST

ఎన్నికల భారతంలో ఎన్నెన్ని సిత్రాలో..!
1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికి ఓ బ్యాలెట్​ బాక్స్​ ఉండేది. నచ్చిన అభ్యర్థికి సంబంధించిన పెట్టెలో ఓటు వేస్తున్న ఓ ఓటరు.
1967లో దిల్లీలోని జామా మసీదు పోలింగ్​ స్టేషన్​లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వరుసలో నిల్చొన్న మహిళలు.
ఆనందకరమైన పెళ్లి రహస్యం సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం. అలాగే దేశాభివృద్ధికి రహస్యం సరైన నాయకుణ్ని ఎన్నుకోవడం. పెళ్లి రోజే ఓటేసేందుకు వచ్చిన వధువు.
ఒంటెలపై ఓటేసేందుకు వెళ్తున్న రాజస్థానీలు
నిరంతర వార్తా ఛానళ్లు లేని కాలంలో 1971లో దిల్లీ ఎర్రకోట ముందు ఎన్నికల ఫలితాలను ఇలా ప్రదర్శించేది ఎన్నికల సంఘం.
1983: 'నేను ఓటేసేది కేవలం నాకోసం కాదు, నా పిల్లల భవిష్యత్ కోసం' అంటూ ఓటు హక్కు వినియోగించుకుంటున్న త్రిపురకు చెందిన రియాంగ్​ గిరిజన మహిళ
ఈవీఎంలు ప్రవేశపెట్టక ముందు 1998లో దిల్లీలో కౌంటింగ్​కు ముందు బ్యాలెట్ పత్రాలను గుమ్మరిస్తున్న దృశ్యం.
అండమాన్​ నికోబార్​ దీవుల్లో ఉండే రాతియుగం నాటి షోంపెన్ తెగ. మొదటిసారి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details