తెలంగాణ

telangana

ETV Bharat / elections

భారత్​ భేరి: రాజకీయాల్లో 'డిటెక్టివ్ నారద'

ఎన్నికలంటే హోరెత్తించే ప్రసంగాలు, ఇంటింటి ప్రచారాలు, అసంతృప్తుల బుజ్జగింపులు, పదునైన మాటల తుటాలు, తెరవెనుక రాజకీయ మంత్రాంగాలు. అంతేనా? కాదనే అంటున్నాయి నేటి తరం రాజకీయాలు. పోటీ చేసే అభ్యర్థి ఎంత బలవంతుడైనా... ఒక గూఢచారి కూడా అవసరమేనట! ఏంటి ఈ నయా రాజకీయం?

భారత్​ భేరి: రాజకీయాల్లో 'డిటెక్టివ్ నారద'

By

Published : Apr 13, 2019, 6:50 AM IST

Updated : Apr 13, 2019, 9:45 AM IST

రాజకీయాల్లో 'డిటెక్టివ్ నారద'

2019 ఎన్నికల కురుక్షేత్రంలో విజయం కోసం నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కోటి వ్యూహాలు ఒక్క విజయం కోసమే అన్నట్లు శ్రమిస్తున్నారు. ఎంతమంది కార్యకర్తల బలమున్నా, ప్రజాకర్షణ ఉన్నా... తమ వెంట ఓ గూఢచారిని ఉంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వీరికి డిమాండ్​ భారీగా పెరిగింది.

ప్రైవేటు గూఢచార సంస్థల సేవల కోసం నాయకులు వరుస కడుతున్నారు. వివిధ పార్టీల నాయకులు ప్రత్యర్థుల రహస్యాలు తెలుసుకోవడానికి డిటెక్టివ్​లను నియమించుకుంటున్నారు. వాటి ఆధారంగా వ్యూహాలు రచిస్తున్నారు.

ఎందుకంటే..?

⦁ ప్రత్యర్థి పార్టీ నాయకుల రోజువారీ కార్యకలాపాలు, ఎన్నికలకు రచించే ప్రణాళికలు వివరాల సేకరించి, ప్రతివ్యూహాలు రచించేందుకు.

⦁ ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచేందుకు.

⦁ ప్రత్యర్థి నాయకుల నేరచరిత్ర, అక్రమ సంబంధాలు, ఇతర రహస్యాలు సేకరించి వాటిని ప్రజల ముందు ఉంచేందుకు.

సొంత నేతలపైనా దృష్టి..!

ప్రత్యర్థులపై ఎంత దృష్టి పెట్టారో... సొంత నాయకుల కార్యకలాపాలపైనా దృష్టి పెట్టేందుకు ఈ గూఢచారులను నియమిస్తున్నారు కొందరు అభ్యర్థులు. పార్టీ టికెట్​ రాని వారు.. తమకు విజయం దక్కకుండా చేస్తారేమోనన్న అనుమానమే ఇందుకు కారణం.

కూటమిపైనా కన్ను...

ప్రత్యర్థులపై, సొంత పార్టీ నేతలపైనే కాదు... పొత్తు పెట్టుకున్న పార్టీలపైనా ఈ గూఢచారులను వినియోగిస్తున్నారట.

"రాజకీయ పార్టీల మధ్య ఈసారి ముందస్తు పొత్తులు ఎక్కువగా కుదిరాయి. ఇలాంటి సమయంలో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎన్నికల ఫలితాలు వచ్చాక మంత్రి పదవులపై బెట్టు చేసే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి వారికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి, సమయం వచ్చినప్పుడు అస్త్రంగా ఉపయోగించాలన్నది వారి ఆలోచన. వీటి కోసం గూఢచారులను నియమిస్తున్నారు."
- మహేశ్​ చంద్రశర్మ, మేనేజింగ్​ డైరక్టర్, జీడీఎక్స్ డిటెక్టివ్స్​, దిల్లీ

కార్యకర్తలపైనా..?

సొంత పార్టీ కార్యకర్తలనూ వీరు నిశితంగా పరిశీలిస్తారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు ప్రత్యర్థులతో ఏమైనా రహస్య మంతనాలు జరుపుతున్నారా? అనే కోణంలో వీరు గూఢచర్యం చేస్తారట.

గూఢచర్యం మహా 'ప్రియం'..!

గూఢచారులకు చెప్పే పనులను బట్టి రూ.లక్ష నుంచి రూ. 60 లక్షల వరకు చెల్లిస్తారట నాయకులు.

Last Updated : Apr 13, 2019, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details