prank videos: ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గుడియాత్తం కాలేజీ రోడ్డులో మస్కట్ వేషం ధరించి అటువైపు వచ్చిపోయే అమ్మాయిలను చేయి పట్టుకొని లాగుతూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవాడు. దీంతో విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. యువకుడు సయ్యద్ కరీముల్లా(21)గా గుర్తించారు.
ప్రాంక్ వీడియో పేరిట వికృత చేష్టలు.. పోలీసుల ఎంట్రీతో...!! - ప్రాంక్ వీడియో పేరిట వికృత చేష్టలు చేస్తున్న యువకుడు అరెస్టు
prank videos: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్న చందంగా తయారైంది ఓ యువకుడి పరిస్థితి. ప్రాంక్ వీడియోలు చేసి అందరినీ ఆశ్చర్యపరచాలనుకున్న యువకుడికి షాక్ తగిలింది. యువకుడి ప్రవర్తనతో విసిగిపోయిన కొంతమంది మహిళలు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు.
Prank video
TAGGED:
ap latest news