తెలంగాణ

telangana

ETV Bharat / crime

కళాశాలకు వెళ్లి తిరిగి రాని యువతి.. నదిలో శవం.. అసలేమైంది..! - బద్వేల్​లో యువతి మృతి

YOUNG WOMAN DIED IN KADAPA: ఆంధ్రప్రదేశ్​లోని కడపజిల్లా బద్వేలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న అనూష అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ నెల 20వ తేదీన కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూష ఈరోజు పెన్నా నదిలో శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

YOUNG WOMAN DIED IN KADAPA
YOUNG WOMAN DIED IN KADAPA

By

Published : Oct 23, 2022, 5:01 PM IST

YOUNG WOMAN DIED IN KADAPA: ఏపీలోని వైఎస్సార్​ కడప జిల్లా బద్వేలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న మరాటిపల్లె గ్రామానికి చెందిన అనూష అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 20వ తేదీన కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు బద్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జంగాలపల్లి సమీపంలోని హెన్నా నదిలో అనూష శవమై కనిపించింది. ఈ విషయాన్ని సిద్ధవటం పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. కళాశాలకు వెళ్లి క్షేమంగా ఇంటికి వస్తుందని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు.. అనూష మృతి చెందిన వార్త వారి గుండెలను పిండి చేసింది.

బద్వేల్ పోలీసులు అనూష మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే కళాశాలలో చదివే విద్యార్థులే కొందరు అనూషను తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details