తెలంగాణ

telangana

ETV Bharat / crime

SUICIDE ATTEMPT: రెండేళ్ల ప్రేమ.. 4రోజుల క్రితం పెళ్లి.. ఆపై ఆత్మహత్యాయత్నం! - తెలంగాణ వార్తలు

రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కలిసిబతకాలని అనుకున్నారు. నాలుగు రోజుల కిందట పెళ్లి చేసుకున్నారు. కట్‌ చేస్తే యువతి ఆత్మహత్యకు(SUICIDE ATTEMPT) యత్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. అసలేం జరిగింది..?

young woman SUICIDE ATTEMPT, SUICIDE ATTEMPT due to love issues
నవవధువు ఆత్మహత్యాయత్నం, యువతి ఆత్మహత్యాయత్నం

By

Published : Aug 4, 2021, 5:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఓ యువతి, దినేష్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి మరీ నాలుగు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. కోటి ఆశలతో కొత్తగూడెంలో కాపురం పెట్టిన ఆమెకు... అనుకోని పరిణామం ఎదురైంది. చేసేది లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు(SUICIDE ATTEMPT) యత్నించింది.

ఏం జరిగింది?

పెద్దలు అంగీకరించకపోయినా దినేష్, తన ప్రేయసి పెళ్లి చేసుకున్నారు. కొత్తగూడెంలో ఒక గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు వచ్చి... యువతిని కొట్టి దినేష్‌ను తీసుకుని పోయారని యువతి తల్లి తెలిపింది. ఆ తర్వాత యువతి పోలీసులను ఆశ్రయించగా... ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని దినేష్ చెప్పినట్లు వెల్లడించారు. ఈ ఊహించని పరిణామంతో మనస్తాపానికి గురైన తమ కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిందని ఆవేదన వ్యక్తం చేసింది.

పరిస్థితి విషమం

యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల నుంచి ప్రేమించి... ఇప్పుడు యువకుడి బంధువు పుల్లారావు అనే వ్యక్తి కారణంగా తమ కూతురికి అన్యాయం చేస్తున్నారని బాధితురాలి తల్లి ఆరోపించారు. 22 ఏళ్ల వయసున్న యువతిని 35ఏళ్లు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు రోజుల క్రితం దినేష్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. కొత్తగూడెంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి కొట్టి.. దినేష్‌ని తీసుకుపోయారు. చేసేది లేక మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు పిలిపిస్తే వచ్చిన దినేష్... మాట మార్చాడు. ఈ అమ్మాయి నాకు వద్దు, నేను తీసుకెళ్లను అని అన్నాడు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అంతేకాకుండా మా కూతురు వయసు ఎక్కువ అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దినేష్ వద్దన్నందుకు మనస్తాపంతో మా కూతురు పురుగుల మందు తాగింది.

-యువతి తల్లి

నవవధువు ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:ATTACK ON YOUNG WOMAN: ప్రేమోన్మాదం.. యువతిపై యువకుడి కత్తి దాడి

ABOUT THE AUTHOR

...view details