Young woman commits suicide: మేనత్త కొడుకుతో తాను తీసుకున్న ఫొటోలు వాట్సప్, ఫేస్బుక్లో వైరల్ అవడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురం గ్రామానికి చెందిన మేఘలత(20) మేనత్త కొడుకు శివకుమార్‌తో పదో తరగతిలో సరదాగా చిన్నప్పుడు కొన్ని ఫొటోలు తీసుకుంది. కానీ వాటిని కొందరు యువకులు వాట్సప్, ఫేస్బుక్లో వైరల్ చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేఘలతకు ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగితో వివాహం నిశ్చయం అయింది. ఇంతలో తనను గ్రామంలో కొందరు శివకుమార్‌తో తీసుకున్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో ఆ బాధను తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోటు రాసి బలవన్మరణానికి పాల్పడింది.