Man suicide due to delay in car delivery : కారు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందాలని భావిస్తే.. అనుకున్న సమయానికి కారు డెలివరీ ఇవ్వలేదన్న క్షణికావేశంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామానికి చెందిన తెలగాపురం కృష్ణ(21) కారు కొనుగోలు చేసి.. కిరాయిలకు తిప్పుతూ ఉపాధి పొందాలని భావించాడు. ఇందుకోసం ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ షోరూమ్‌ను సంప్రదించాడు. కారు ధర రూ.8.71 లక్షలు కాగా.. రూ.2.5 లక్షలు డౌన్ పేమెంట్‌గా చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు మే 23న రూ.50 వేలు చెల్లించాడు. మిగిలిన రూ.2 లక్షలు చెల్లించి.. కారును తీసుకెళ్లాలని నిర్వాహకులు సూచించారు.