Electric shock one died: సికింద్రాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. తెల్లవారుజామున ఐకాం కంపెనీ సమీపంలో కమాన్ నిర్మిస్తున్న క్రమంలో అంజి అనే కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
Electric shock one died: కూలీ పని కోసం వెెళ్తే ... విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి
Electric shock one died: ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని జవహర్ నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విద్యుత్ షాక్ తో కార్మికుడు మృతి
సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఇంటిపెద్ద మృతితో అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి:నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి.. ఇంజక్షన్ వల్లేనా.?
Last Updated : Mar 2, 2022, 12:15 PM IST