తెలంగాణ

telangana

ETV Bharat / crime

శంషాబాద్ ఎయిర్​పోర్టులో కామాంధుడు.. మహిళలపై లైంగిక వేధింపులు

మహిళలపై ప్రతిరోజు ఎక్కడో ఒకచోట లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఉద్యోగరీత్యా కార్యాలయాలకు వెళ్లే మహిళలపై ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్​లోని ​శంషాబాద్​ విమానాశ్రయంలో పనిచేసే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎయిర్​పోర్ట్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

sexual harassment on shamshabad airport in agile services women employees
శంషాబాద్ ఎయిర్​పోర్టులో కామాంధుడు.. మహిళలపై లైంగిక వేధింపులు

By

Published : Feb 6, 2021, 5:44 PM IST

Updated : Feb 6, 2021, 5:58 PM IST

హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఎయిర్​పోర్ట్​ పీఎస్​లో కేసు నమోదైంది. అడ్మిన్ శ్రీకాంత్​ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధిత మహిళలు ఆరోపించారు. రూముకు రాకపోతే మీ ఉద్యోగాలు ఉండవంటూ బెదిరించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.

శంషాబాద్ ఎయిర్​పోర్టులో కామాంధుడు.. మహిళలపై లైంగిక వేధింపులు

శంషాబాద్ విమానాశ్రయంలోని ఎజైల్​ సర్వీసెస్​లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులపై అడ్మిన్​ శ్రీకాంత్ ఆకృత్యాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. మీ ఉద్యోగం ఉండాలంటే శారీరకంగా తనతో గడపాలని బెదిరించేవాడని బాధితులు వాపోయారు. లైంగిక వేధింపులు తాళలేక ఎనిమిది మంది మహిళా సిబ్బంది ఎయిర్​పోర్ట్​ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. అతనితో తమకు ప్రాణ హాని ఉందని.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని‌ బాధిత మహిళలు కోరారు.

ఇదీ చూడండి :అదుపు తప్పిన బైక్.. ఓ విద్యార్థి మృతి

Last Updated : Feb 6, 2021, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details