ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రోడ్డులో వాహనాలపై వెళ్తున్న వారిని.. కొందరు మహిళలు ఆపి ప్రకృతి విపత్తుల బాధితుల పేరిట విరాళాలు అడుగుతున్నారు. టీషర్టు, జీన్స్ ధరించి ఐటీ ఉద్యోగుల మాదిరిగా కనిపిస్తుండటంతో.. కొందరు నమ్మి డబ్బులిస్తున్నారు.
కాలేజ్ అమ్మాయిల్లా కనిపిస్తారు.. విరాళాల పేరుతో దండుకుంటారు!
చూసేందుకు వారు కాలేజీ అమ్మాయిల్లా కనిపిస్తారు. కానీ చేసేది మాత్రం కొత్త రకం దందా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఏపీలోని గుంటూరు నగర శివార్లలో రహదారిపై వెళ్తున్న వాహనదారులను కొందరు మహిళలు ఆపి.. ప్రకృతి విపత్తుల బాధితుల పేరిట విరాళాలు అడుగుతున్నారు. విరాళాలు ఇవ్వని వారిని హిందిలో తిడుతుండడంపై.. వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
కాలేజ్ అమ్మాయిల్లా కనిపిస్తారు.. విరాళాల పేరుతో దండుకుంటారు!
విరాళాలు ఇవ్వని వారిని.. ఆ అమ్మాయిలు హిందీలో తిడుతున్నారు. కనీసం వారు విరాళాలు సేకరించే సంస్థ పేరు గానీ.. ఎవరికి వాటిని అందిస్తారనే వివరాలు కానీ చెప్పటం లేదు. ఇలా రోజుకో ప్రాంతంలో వసూళ్ల కార్యక్రమం చేపడుతున్నారు.