భర్త పండగకు రానన్నాడని మనస్తాపంతో ఓ వివాహిత బలవన్మరణాని (SUICIDE)కి పాల్పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మేడిగడ్డకి చెందిన వడ్త్యావత్ మౌనిక (20)కు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు అనిల్‌తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. అనిల్ డీసీఎం డ్రైవర్. దసరా పండగకు ఊరికి రావాలని భార్య మౌనిక భర్తకు ఫోన్ చేసింది. పని ఉందని వెంటనే రావడానికి వీలు కాదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది.
SUICIDE: భర్త పండుగకు రానన్నాడని... భార్య ఆత్మహత్య - భార్య బలవన్మరణం
08:22 October 15
క్షణికావేశంలో ఆత్మహత్య
పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య (SUICIDE)కు పాల్పడింది. స్థానికులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధర్మేశ్ తెలిపారు. పండుగ పూట జరిగిన విషాదంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయాయి.
ఇదీ చూడండి:BUS ACCIDENT: ఆర్టీసీ బస్సు బోల్తా, 20 మందికి గాయాలు
Gang Rape at Rajendranagar : ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత?