తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆ విషయంలో  భర్తను చంపిన భార్య.. - అనంతపురంలో భర్తను హతమార్చిన భార్య న్యూస్

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. తన సమీప బంధువులతో కలిసి భర్తను అతి కిరాతకంగా హతమార్చింది. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

husband murder in kadiri
కదిరిలో భర్త హత్య

By

Published : Feb 24, 2021, 10:00 AM IST

వివాహేతర సంబంధం, డబ్బు వివాదంతో కట్టుకున్న భర్తనే.. భార్య హత్య చేసి పాతిపెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. ఈ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన నాగభూషణం, ఈశ్వరమ్మ భార్యాభర్తలు. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టుగా తెలుసుకున్న నాగభూషణం.. పద్ధతి మార్చుకోవాలని ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఈశ్వరమ్మ.. సమీప బంధువులతో కలిసి అతన్ని హత్య చేసింది. అనంతరం పట్టణ శివారులో పాతిపెట్టింది.

నాగభూషణం కనిపించకపోవడంతో అతని బంధువులు కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈశ్వరమ్మతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. పోలీసుల దర్యాప్తులో నాగభూషణాన్ని తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. భర్తను పాతిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చెప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:ఆస్తి తగాదా: ఒంటరి మహిళపై బంధువుల దాడి

ABOUT THE AUTHOR

...view details