Sexual assault: లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను చేరవేయాల్సిన ఓ వాలంటీరు.. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన వార్డులోని ఓ వివాహిత ఫోన్కు అసభ్యకరమైన సందేశాలు పంపించడమే కాకుండా.. భర్త లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది.
Sexual assault: భర్త ఇంట్లోలేని సమయంలో.. వాలంటీరు ప్రవేశించి.. - ఏపీ క్రైమ్ న్యూస్
Sexual assault: ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయాల్సిన ఓ వాలంటీరు.. దుర్మార్గానికి పాల్పడ్డాడు. తన వార్డులోని ఓ వివాహిత ఫోన్కు అసభ్యకరమైన సందేశాలు పంపించి.. భర్త లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.
Sexual assault: భర్త ఇంట్లోలేని సమయంలో.. వాలంటీరు ప్రవేశించి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక పరిధిలోని ఆరో వార్డులో.. జమాల్ వలి వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అదే వార్డుకు చెందిన ఓ వివాహితకు ఫోన్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపించాడు.
భర్త లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె మూడో పట్టణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ ఆనందరావు ఈ వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: