తెలంగాణ

telangana

ETV Bharat / crime

Vijayawada Cheddi Gang Arrested : పోలీసుల అదుపులో 'చెడ్డీ గ్యాంగ్'.. గుజరాత్‌లో దొరికిన ముగ్గురు దొంగలు

Vijayawada Cheddi Gang Arrested : ఏపీలోని విజయవాడలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యులు గల చెడ్డీ గ్యాంగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడ చెడ్డీ గ్యాంగ్, Vijayawada Chedi Gang
విజయవాడ చెడ్డీ గ్యాంగ్

By

Published : Dec 18, 2021, 10:17 AM IST

పోలీసుల అదుపులో 'చెడ్డీ గ్యాంగ్'

Vijayawada Cheddi Gang Arrested :ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లా వాసులను కంటిమీద కునుకులేకుండా చేసిన.. చెడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో జరిగిన ఘటనా స్థలంలో దొరికి వేలిముద్ర సాయంతో.. పోలీసులు దర్యాప్తు చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌ సరిహద్దులోని ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు అనుమానించి ఆ దిశగా దృష్టి పెట్టారు. దొంగలు సెల్‌ఫోన్లు వాడి ఉంటారా? అన్న కోణంలో విస్తృతంగా పరిశీలించారు. ప్రధానంగా విజయవాడ రైల్వేస్టేషనుకు ఈ రెండు రాష్ట్రాల రైళ్లు వచ్చిన సమయాలలో అక్కడి సెల్‌టవర్‌ డంప్‌ను సేకరించారు. ఘటనా స్థలాల్లోని డంప్‌నూ తీసుకుంటే దాదాపు లక్ష కాల్స్‌ వచ్చాయి. వీటి నుంచి కుదిస్తూ చూస్తే.. రెండు నెంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. ఇవి ఈ ముఠా గుజరాత్‌ నుంచి బయలుదేరే రోజే ఆక్టివేట్‌ చేయించుకున్నట్లు గుర్తించారు. ఈ నెంబర్ల నుంచి ఎక్కడికి కాల్స్‌ వెళ్తున్నాయి? ఎవరెవరు వీటికి చేస్తున్నారు? అన్నది డంప్‌ విశ్లేషణలో పోలీసులు బయటకు తీశారు. ఈ రెండు నెంబర్ల నుంచి గుజరాత్‌లోని గార్బార్డ్‌లోని ఓ ఫోన్‌కు తరచూ కాల్స్‌ వెళ్లినట్లు తేలింది. ఈ నెంబర్లకు సంబంధించి కాల్‌ డేటా రికార్డ్స్‌ను తెప్పించి వడపోయడంతో పలు ఆధారాలు దొరికాయి.

Cheddi Gang Arrested : చెడ్డీ గ్యాంగ్‌ విజయవాడ పాల ఫ్యాక్టరీ సమీపంలో దొంగతనం చేసి.. గుంటూరు జిల్లా తెనాలి వెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజుల పాటు అక్కడి రైల్వే స్టేషనులోనే ప్లాట్‌ఫారాలపై ఉన్నట్లు తెలిపారు. అనంతరం గుంటుపల్లిలో దొంగతనం జరిగిన రోజు మళ్లీ విజయవాడ వచ్చి రైల్వేస్టేషనులోని ప్లాట్‌ఫారంపై షెల్టర్‌ తీసుకున్నారు. తాడేపల్లి ప్రాంతాల్లో చేసిన రోజు అక్కడి రైల్వే వంతెన కింద ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

Cheddi Gang News : విజయవాడ పోలీసులు.. చెడ్డీ గ్యాంగ్‌ను నిర్ధరించుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేశారు. గుజరాత్‌ పోలీసుల సమాచారంతో పాటు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా కూడా వివరాలు తెప్పించుకున్నారు. దాహోద్‌ ప్రాంతంలో దొంగలు ఎవరెవరు ఉన్నారు? స్థానికంగా లేని వారు ఎవరు? అన్న వివరాలు సేకరించారు. ఇక్కడి సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను గుజరాత్‌ పోలీసులకు పంపించి ఆరా తీశారు. మొత్తం పది మంది స్థానికంగా లేనట్లు రూఢి చేసుకున్నారు. విజయవాడ నుంచి దొంగలు గుజరాత్‌ వెళ్లిపోయినట్లు వారి సెల్‌ లొకేషన్‌ బట్టి తెలుసుకుని ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. అలా అక్కడ వారు రైలు దిగగానే పట్టుకోగలిగారు. మిగితా ఏడుగురి కోసం గాలిస్తున్నారు. ముఠా సభ్యుల నుంచి డబ్బు, వెండిసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Cheddu Gang Robberies : చెడ్డీగ్యాంగ్‌ వారి స్వగ్రామాల్లో కూలి పనులు చేసుకుని పొట్ట నింపుకుంటారు. పనులు లేని సమయాల్లో చోరీలకు పాల్పడుతురాని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని... దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు.

శివారు ప్రాంతాలే టార్గెట్..!

శివారు ప్రాంతాల్లో..రహదారికి సమీపంగా ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా తమ పని పూర్తి చేసుకుంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రాంతాలను ఎంపిక చేసుకునేందుకు పగటిపూట ఆటోలు, బస్సుల్లో ప్రయాణించి రెక్కీ నిర్వహించడం.., రాత్రివేళ చోరీ అనంతరం అక్కడి నుంచి సులువుగా పారిపోయేవారని తెలిపారు. శీతాకాలంలో అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చేవారు చాలా తక్కువ ఉంటారని..ఇదే అదనుగా ముఖానికి మంకీ క్యాప్‌ పెట్టుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details