తెలంగాణ

telangana

ETV Bharat / crime

రూ.11 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత.. ఎక్కడో తెలుసా? - latest crime news

GOLD SEIZED IN AP: బంగారాన్ని అక్రమంగా తరలించడానికి స్మగ్లింగ్​ రాయళ్లు కొత్త పంథాకు దారి తీశారు. విమానాల ద్వారా బంగారం చేరవేస్తే అనుమానం వస్తుందని భావించి.. రోడ్డు మార్గంలో పసిడి తరలించడం ప్రారంభించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న కస్టమ్స్​ అధికారులు.. ఊరుకుంటారా ఇంకా వారి పని వారు కానిచ్చారు. భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

GOLD SEIZED
అక్రమ బంగారం పట్టివేత

By

Published : Oct 20, 2022, 10:35 PM IST

GOLD SEIZED IN AP: ఇతర ప్రాంతాల నుంచి ఏపీ రాష్ట్రంలోకి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 కోట్ల రూపాయల విలువైన 13.189 కేజీల బంగారం స్మగ్లింగ్ వ్యవహారాన్ని ఛేదించినట్లు.. కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయం వెల్లడించింది. నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేట, చిలకలూరిపేటలో ఒకేసారి ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపింది.వంద మంది కస్టమ్స్ అధికారులు 20 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించినట్లు వివరించింది.

చెన్నై నుంచి సూళ్లూరుపేటకు బస్సులో వస్తున్న ఓ వ్యక్తి నుంచి 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్​ కార్యాలయం వెల్లడించింది. లెక్కల్లో చూపని 4.24 కోట్ల రూపాయల నగదు కూడా పట్టుకున్నట్టు కస్టమ్స్ విభాగం ప్రకటించింది. స్మగ్లింగ్ చేస్తున్న బంగారంపై విదేశీ కంపెనీల గుర్తులు ఉన్నట్లు తేల్చింది. స్మగ్లింగ్‌కు సంబంధించి నలుగురిని అరెస్టు చేసి, ఆర్థిక నేరాల కోర్టులో హాజరు పరిచినట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది.

ఏపీలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details