హైదరాబాద్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై నుంచి ఓ గుర్తు తెలియని యువతి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే అక్కడ ఉన్న వాహనదారులు గమనించి... పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లో యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యాయత్నం.. తీవ్ర గాయాలు - హైదరాబాద్ తాజా వార్తలు
గుర్తుతెలియని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన... హైదరాబాద్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యాయత్నం
ఫ్లైఓవర్ పై నుంచి దూకడంతో యువతి కాళ్లు, వెన్ను భాగంలో తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో కరోనా.. అంకెల్లో ఇలా...