నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూసాంగ్వి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం పశువుల కాపరులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వినయ్... మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..
నిర్మల్ జిల్లా న్యూసాంగ్వి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..
సుమారు 55 ఏళ్ల వయసున్న వ్యక్తిని బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని సీఐ జీవన్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని గుర్తించకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారని అన్నారు. హత్యకు ఒడిగట్టిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అర్ధరాత్రి కార్ల అద్దాలు ధ్వంసం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు