తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja seized: భారీగా గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - జనగామలో సీజ్

Ganja seized: జనగామ జిల్లాలో భారీస్థాయిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును సీజ్​ చేశారు. గంజాయి విలువ దాదాపుగా రూ.29,12,500 ఉంటుందని పోలీసులు తెలిపారు.

Ganja seized
జనగామ జిల్లాలో భారీస్థాయిలో గంజాయి స్వాధీనం

By

Published : Feb 26, 2022, 5:24 PM IST

Ganja seized: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 291 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మోండ్రయి గిర్ని తండా దుర్గమ్మ గుడి వద్ద కారులో తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన గంజాయి విలువ దాదాపుగా రూ.29,12,500 ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పాలకుర్తి సర్కిల్ కొడకండ్ల పోలీసులను జనగామ డీసీపీ సీతారాం అభినందించారు.

'మత్తుకు బానిసలై యువత వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వరంగల్ కమిషనరేట్​లో డ్రగ్స్​ నిర్మూలనే లక్ష్యంగా మేం కృషి చేస్తున్నాం. యువతకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు గంజాయి రవాణాకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిస్తే మాకు సహకారం అందించండి. వారికి మేం సరైన కౌన్సిలింగ్ ఇస్తాం. పోలీసు శాఖ తరఫున వారిని మార్చేందుకు ప్రయత్నిస్తాం.' - సీతారాం, డీసీపీ

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details