Two People Washed Away in SRSP Canal : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామానికి చెందిన ఎండీ బిక్కన్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చారు. సోమవారం ఆయన కుమారులు కరీం, కలీం, అల్లుడు జమీర్, తమ్ముడి కుమారుడు సమీర్ సమీపంలోని ఎస్సారెస్పీ వరదకాలువలో స్నానానికి వెళ్లారు.
Two People Washed Away in SRSP Canal : సరదా శాపమైంది.. ప్రవాహం ప్రాణాలు తీసింది - ఎస్సారెస్పీ కాల్వలో ఇద్దరు మృతి
Two People Washed Away in SRSP Canal : సరదా వారికి శాపమైంది. నీళ్లు వారి కుటుంబాలను కన్నీట నెట్టేసింది. ఆ కాల్వ కన్నవాళ్లకు గుండెకోత మిగిల్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో సరదాగా వరదకాల్వలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు ప్రవాహంలో కొట్టుకుపోగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు ఇవాళ శవమై తేలారు.
Two People Died in SRSP Canal : కాలువలోకి దిగగా నీటి ప్రవాహంలో కలీం (21), జమీర్ (24) కొట్టుకుపోయారు. కరీంను సమీర్ కాపాడారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు చేపట్టడం వీలుకాలేదు. ఇవాళ ఉదయమే వారి కోసం రంగంలోకి దిగిన ఈతగాళ్లు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాల్వ నుంచి ఎం.డి.ఖలీమ్, ఎం.డి.జమీర్ మృతదేహాలు బయటకు తీశారు. సొంతూరుకు వచ్చి.. సరదాగా గడుపుదామనుకున్న కుమారుడు, అల్లుడు నిర్జీవంగా పడి ఉండటం చూసి వారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.