వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని ఆబ్కారీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట పట్టణానికి చెందిన చాంద్ పాషా, గంగన్న గూడ్స్ వాహనంలో ఎలాంటి అనుమతులు లేకుండా14 క్వింటాళ్ల బెల్లాన్ని, 20 కిలోల నవసాగ్రాన్ని తరలించే ప్రయత్నం చేశారు. ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ బెల్లాన్ని తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్.. - వనపర్తిలో ఇద్దరి అరెస్ట్
వనపర్తి జిల్లాలోని రంగాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల బెల్లాన్ని, 20 కిలోల నవసాగ్రాన్ని ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా బెల్లం తరలిస్తున్నఇద్దరి అరెస్ట్
విషయం తెలుసుకున్న అధికారులు వెంబడించి మరీ ఆ వాహనాన్ని పట్టుకున్నట్లు ఆబ్కారీ వలయాధికారి ఓంకార్ తెలిపారు. బెల్లాన్ని కొత్తకోట మండలంలోని పలు తండాలో సారా తయారీకి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అక్రమంగా బెల్లం తరలింపు, నాటు సారా తయారీకి ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి:రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్s