Theft with youtube support: చోరీలు, దోపిడీలు, దొంగతనాలు చేసే నేరస్థులు కొత్త ఐడియాలతో తమ పని చేసుకుపోతున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా.. భారీ మొత్తంలో డబ్బులు కాజేసేందుకు పక్కా స్కెచ్‌లు వేసుకుంటున్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో రెక్కీ నిర్వహించి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలు చేసిన వాళ్ల గురించి చాలాసార్లు విన్నాం. కానీ ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మైనర్లు ఆన్లైన్ గేమ్స్, జల్సాలకు అలవాటుపడి దొంగలుగా మారారు. పోలీసులకు చిక్కకుండా చోరీ చేసేందుకు టెక్నికల్ ట్రిక్స్‌ని యూట్యూబ్ వీడియోలో చూసి యత్నించారు.
యూట్యూబ్‌లో చూసి దొంగతనం చేసి, ఇద్దరు మైనర్ల ఆన్లైన్ చోరీ - దొంగతనం వార్తలు
Two minors Arrest యూట్యూబ్‌లో చూసి దొంగతనం చేశారు. అన్ని ట్రిక్స్ కరెక్టుగానే ఫాలో అవుతున్నామనుకున్నారు. కట్ చేస్తే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ దొంగతనం చేసింది కూడా ఆన్లైన్ గేమ్స్, జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్లే.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోపాలపట్నంకు చెందిన ఇద్దరు మైనర్లు యూట్యూబ్‌లో చూసి దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నారు. అవసరమైన పరికరాలు కొనుగోలు చేశారు. ఇంకేముంది రంగంలోకి దిగి పనిమెుదలు పెట్టారు. ఈనెల 15న వేపగుంటదరి నాయుడుతోటలో తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించారు. ఇళ్లంతా వెతికినా వారికి ఏమీ దొరకలేదు. కప్‌బోర్డ్‌లో ఓ కారు తాళం కనిపించగా.. దాన్ని తీసుకుని బయట పార్కు చేసిన కారుతో అక్కడి నుంచి ఉడాయించారు. మరుసటి రోజు పనిమనిషి వచ్చి చూడగా..తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని ఆమె దిల్లీలో ఉన్న యాజమానికి తెలిపింది. హుటాహుటిన ఇంటికి చేరుకున్న యాజమాని.. పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా.. దొంగతనానికి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. కారుతో పాటు దొంగతనానికి ఉపయోగించిన రాడ్, స్క్రూడ్రైవర్, సుత్తి ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి
TAGGED:
theft with YouTube support