Rape On Girl: బాలికపై అత్యాచారం.. పాఠశాలకు వెళ్తుండగా..! - Rape news
14:23 January 04
వనపర్తి జిల్లాలో బాలికపై అత్యాచారం
Rape On Girl: తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను పాఠశాలకు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కాపుకాసి బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టిన తర్వాత పాఠశాల వద్ద విడిచివెళ్లారు. బాధితురాలు ఏడుస్తూ పాఠశాలకు వెళ్లింది.
బాలికను ఉపాధ్యాయులు గమనించి ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చేరవేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికకు న్యాయం చేయాలంటూ ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. డీఎస్పీ వారిని సముదాయించగా ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: