సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు బాహ్య వలయ రహదారిపై రోడ్డు ప్రమాదం(lorry accident) సంభవించింది. అత్తాపూర్‌కు చెందిన లారీ ముందు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన తమిళనాడుకు చెందిన లారీ బలంగా ఢీ కొట్టింది.
Accident: రెండు లారీలు ఢీ.. డ్రైవర్ స్పాట్ డెడ్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు బాహ్య వలయ రహదారిపై తెల్లవారు జామున ముందు వెళుతున్న ఇటుకల లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ(lorry accident) కొట్టింది. దీంతో డ్రైవర్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.
దీంతో తమిళనాడుకు చెందిన లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడం వల్ల… డ్రైవర్ కార్తిక్ రాజు క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే క్యాబిన్లో ఉన్న క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నుజ్జునుజ్జు అయిన లారీ క్యాబిన్ నుంచి క్రేన్ సహాయంతో డ్రైవర్ కార్తిక్ రాజును బయటకు తీసి… శవాగారానికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఒకే చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్య