Bokkamanthulapadu knife attack : నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతుల పాడులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య వివాదాల నేపథ్యంలో కత్తులతో దాడులు చేసుకున్నారు. ఇందులో తీవ్రంగా గాయపడిన కమతం అచ్చమ్మ(60) అనే వృద్ధురాలు మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడి చేసుకున్న ఘటనలో అచ్చమ్మ మృతి చెందగా... ఆమె కుమారుడు, భర్త, అమ్మ పరిస్థితి విషమంగా ఉంది. వారు మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Bokkamanthulapadu knife attack : భార్యాభర్తల మధ్య గొడవ.. కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడులు! - నల్గొండ నేర వార్తలు
Bokkamanthulapadu knife attack : భార్యాభర్తల మధ్య గొడవ... కాస్తా ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇరు కుటుంబసభ్యులు క్షణికావేశంలో కత్తులతో దాడులు చేసుకొని... ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో జరిగిన కత్తులతో దాడులతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
అచ్చమ్మ కుమారుడి అత్తగారు... వీరిపై దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఆమె కుమారుడు శివ నారాయణ, కోడలు శ్యామల మధ్య గొడవలు జరగగా... వారు దూరంగా ఉంటున్నారు. పెద్దమనుషులు ద్వారా ఇటీవలె నచ్చజెప్పారు. మళ్లీ ఈ దంపతుల మధ్య గొడవ జరగడంతో మంగళవారం ఉదయం... శ్యామల తరఫు బంధువులు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కోపోద్రిక్తులైన శ్యామల బంధువులు... అచ్చమ్మ కుటుంబంపై కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో అచ్చమ్మ ప్రోణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... విచారణ చేపట్టారు. గ్రామంలో జరిగిన ఈ కత్తుల ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
ఇదీ చదవండి:Weapons seized: స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో అక్రమ ఆయుధాలు.. సీజ్ చేసిన పోలీసులు