నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉదయం.. బైక్‌పై పెద్ద కొత్తపల్లి వైపు నుంచి నాగర్ కర్నూల్‌కు వస్తుండగా కొల్లాపూర్ చౌరస్తా వద్ద వారిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి - two died in road accident at kollapur x road
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘనటలో ఒకరు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కన్నవారు దూరమైనా.. కడచూపునకు నోచుకోని ప్రవాసాంధ్రులు!