జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కార్లలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వస్తున్న కారు-కోరుట్ల నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అనంతరం రెండు కార్లూ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయాయి. రోడ్డు పక్కనే వ్యవసాయబావి ఉండగా.. మీటరు దూరంలో ఆగిపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కార్లలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.