Crime News: ఆ ఇంట్లో రెండు మృతదేహాలు.. అసలేం జరిగింది? అవి ఎవరివి? - dead bodies found in khammam district
10:05 September 02
పెనుబల్లి మండలంలో మృతదేహాల కలకలం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని లంకపల్లిలో మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఓ పాడుబడిన ఇంట్లో రెండు మృతదేహాలు కనిపించాయి. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. వారు ఆత్మహత్య చేసుకున్నారో లేక ఎవరైనా హత్య చేశారోనని ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా స్థానికులను ప్రశ్నించారు. రెండ్రోజుల క్రితం వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని కొందరు భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దర్యాప్తు వేగవంతం చేసి వారి మృతికి గల కారణాలు తెలుసుకుంటామని తెలిపారు.