రాంగ్ రూట్.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు వల్ల.. అతనితో పాటు అవతలి వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగింది.
రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి - చౌటుప్పల్
ఎంత అత్యవసరమైన కచ్చితంగా రూల్స్ పాటించే తీరాలని ట్రాఫిక్ పోలీసులు ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది ఆ విషయంలో నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఆ పొరపాటే.. పెను ప్రమాదాలకు దారి తీస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాగే ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో.. ఇద్దరు మృతి చెందారు.
రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి
ఆరెగూడెం గ్రామానికి చెందిన సుజిత్ రెడ్డి ద్విచక్రవాహనంపై రాంగ్ రూట్లో వెళ్తూ.. ఎదురుగా వస్తోన్న మరో బైక్‌ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో.. ఫార్మా ఉద్యోగి మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన సుజిత్‌ను ఆస్పత్రికి తరలించగా.. అతనూ చికిత్స పొందుతూ మరణించాడు.
ఇదీ చదవండి:మిస్టరీ వీడిన హత్య కేసు.. బావమరిదే హంతకుడు