సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను అందిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్‌లోని జాంతార, ధన్‌బాద్ చెందిన ఇద్దరు... బ్యాంకు ఖాతాలను తెరిచి... మోసాలకు పాల్పడేందుకు తోటి సైబర్ నేరగాళ్లకు వాటిని అందించారు.
గతేడాది మే నెలలో నగరానికి చెందిన ఇద్దరికి సైబర్ నేరగాళ్లు వేర్వేరుగా ఫోన్లు చేశారు. కేవైసీని అప్డేట్ చేయాలని ఒకరిని, ఏటీఏం కార్డు మార్చాలంటూ మరొకరిని నమ్మించి... బ్యాంకు ఖాతా రహస్య వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరి నుంచి కలిపి దాదాపు రూ. లక్షా 70 వేలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులు ఝార్ఖండ్ వాసులుగా గుర్తించారు.