హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై బుధవారం వాదనలు జరగనున్నాయి. ప్రధాన నిందితుడు సాదుద్దీన్..... నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు కస్టడీ ముగిసినందున బెయిల్ జారీ చేయాలని... దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని సాదుద్దీన్ తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఘటన నిందితులకు బెయిల్ పిటిషన్‌పై రేపు వాదనలు - Jubileehills gang rape
జూబ్లీహిల్స్ ఘటన నిందితులకు బెయిల్ పిటిషన్‌పై రేపు వాదనలు జరగనున్నాయి. నాంపల్లి కోర్టులో ప్రధాన నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జువైనల్ జస్టిస్ బోర్డులో ఐదుగురు మైనర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఐదుగురు మైనర్లు సైతం జువైనల్ జస్టిస్ బోర్డులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు జువైనల్ జస్టిస్ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున మైనర్లకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది బోర్డు ఎదుట వాదించారు. సమాజంలో పలుకుబడి ఉన్న మైనర్ల తల్లిదండ్రులు దర్యాప్తునకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉండొచ్చని న్యాయవాది తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న జువైనల్ జస్టిస్ బోర్డు.... తీర్పును రేపటికి వాయిదా వేసింది.