తెలంగాణ

telangana

ETV Bharat / crime

Child Pornography : చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం.. యువకుడి అరెస్టు - child pornography case in hyderabad

తిరుపతిలో చిన్నారులను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించి అశ్లీల చిత్రాలు, వీడియోలు చిత్రీకరిస్తున్న (Child Pornography ) మోహన్‌కృష్ణ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా చిన్న పిల్లల అసభ్యకర, అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్న, విక్రయిస్తున్న వారిని గుర్తించే లక్ష్యంతో సీబీఐ దాడులు నిర్వహించింది. అందులో భాగంగా తిరుపతి యశోద నగర్‌కు చెందిన మోహన్ కృష్ణ ఇతరులతో కలిసి ఈ తరహా వ్యాపారం చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది.

arrest
arrest

By

Published : Nov 17, 2021, 4:55 PM IST

తిరుపతిలో చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం చేస్తున్న (Child Pornography) యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి యశోదనగర్‌లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న మోహన్‌కృష్ణను సీబీఐ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో చిన్న పిల్లలను బలవంతంగా సెక్స్ కార్యకలాపాల్లోకి దింపి.. ఆ క్రమంలో తీసిన అశ్లీల చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాలల్లో పోస్టు చేసి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా చిన్న పిల్లల అసభ్యకర, అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్న, విక్రయిస్తున్న వారిని గుర్తించే లక్ష్యంతో సీబీఐ దాడులు నిర్వహించింది. అందులో భాగంగా తిరుపతిలో మోహన్ కృష్ణ ఇతరులతో కలిసి ఈ తరహా వ్యాపారం చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. చిత్తూరు జిల్లా సీబీఐ ఎస్పీ సునీల్ సింగ్ రావత్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

14 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు..

ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులు, దోపిడీకి పాల్పడుతున్న (Child Pornography) వారిపై దేశవ్యాప్తంగా మంగళవారం సీబీఐ దాడులు చేసింది. ఏపీలోని తిరుపతి, అనంతపురం జిల్లా కనేకల్లు సహా 14 రాష్ట్రాల్లోని 77 ప్రదేశాల్లో ఆదివారం సోదాలు నిర్వహించింది. సీబీఐలోని ఆన్‌లైన్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌, ఎక్స్‌ప్లాయిటేషన్‌ ప్రివెన్షన్‌/ ఇన్వెస్టిగేషన్‌ (ఓసీఎస్‌ఏఈ) విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఈ దాడులు చేపట్టింది.

విదేశీ ముఠాల పాత్ర!

దేశవ్యాప్తంగా 83 మందిపై 23 కేసులు నమోదు చేసింది. ఈ దందాలో దేశ, విదేశాల్లోని పలు ముఠాలు, సంస్థల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. సుమారు 5 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోలు పంచుకుంటున్నారు. సోదాల్లో ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైళ్లు, ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలోని యశోదనగర్‌కు చెందిన టి.మోహన్‌కృష్ణపై ఐపీసీ 120 బీ, ఐటీ చట్టంలోని 67 బీ ప్రకారం కేసులు నమోదుచేసి అరెస్టు చేశారు. కొన్నాళ్లుగా మోహన్‌కృష్ణ చర్యలను ఆన్‌లైన్‌లో పసిగట్టిన పోలీసులు.. చిత్తూరు జిల్లా సీబీఐ ఎస్పీ సునీల్‌సింగ్‌ రావత్‌తో ప్రాథమికంగా విచారణ చేయించారు. మోహన్ కృష్ణ ఇతరులతో కలిసి ఈ తరహా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

హైదరాబాద్​లోనూ

సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు పోస్టు చేస్తున్న (Child Pornography ) హైదరాబాద్​కు చెందిన వ్యక్తిని పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. మాదాపూర్​లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మధుకర్​రెడ్డి.. సోషల్​మీడియాలో అశ్లీల వీడియోల లింకులు పంపి డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా భద్రత విభాగం పోలీసులు... మధుకర్​రెడ్డిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మధుకర్​రెడ్డిని గాలించగా.. కరీంనగర్​లో పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇదీ చదవండి:చిన్నారుల అశ్లీల వీడియోలు... రంగంలోకి కేంద్ర హోంశాఖ... హైదరాబాద్​లో అరెస్టు

'48 శాతం విద్యార్థులు ఇంటర్నెట్​లో అవే చూస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details