Hashish Oil sales Gang Arrest : హైదరాబాద్‌లో హాషీష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మహ్మద్ అఫ్‌రోజ్, ముజీబ్ పాషా, ఉపేందర్‌రావు, వెంకటేశ్ ముఠాగా ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి హషీష్ ఆయిల్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు.
Hashish Oil sales Gang Arrest: హాషీష్ ఆయిల్ ముఠా గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్ - తెలంగాణ నేర వార్తలు
Hashish Oil sales Gang Arrest: మత్తు పదార్థాలు, హషీష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి అయిదు లీటర్ల హషీష్ ఆయిల్, మూడు ఫోన్లు, 3 వేల రూపాయల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
లీటర్ హాషీష్ ఆయిల్ సుమారు రూ.3 నుంచి 5లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిషేధిత ఆయిల్‌ను సరఫరా చేసేందుకు యత్నిస్తుండగా... హయత్‌నగర్ ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో ముఠా పట్టుబడింది. ముఠాలోని మరో నిందితుడు వెంకటేశ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నామని తెలిపారు. వారి నుంచి అయిదు లీటర్ల హషీష్ ఆయిల్, మూడు ఫోన్లు, 3 వేల రూపాయల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:అమెజాన్‌లో మన్యం నుంచి పలు రాష్ట్రాలకు గంజాయి స్మగ్లింగ్.. కోట్లలో బిజినెస్!