తెలంగాణ

telangana

ETV Bharat / crime

గోదావరిలో ముగ్గురు గల్లంతు.. ఒకరు మృతి - telangana news

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గోదావరిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. స్నానం చేస్తుండగా అదుపుతప్పి నదిలో మునిగిపోయారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది.

three people missing in godavari, one dead in godavari
గోదావరిలో ముగ్గురు గల్లంతు, గోదావరి మునిగి ఒకరు మృతి

By

Published : Apr 12, 2021, 9:51 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. కొవ్వూరు పరిధిలోని గోష్పాద క్షేత్రం దగ్గర.. నిన్న సాయంత్రం ఆరుగురు యువకులు స్నానానికి వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా ముగ్గురు పట్టు తప్పి గల్లంతయ్యారు.

వారి కోసం స్థానికుల సహాయంతో పోలీసులు, ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలించాయి. ఆ ముగ్గురినీ చాగల్లు వాసులుగా గుర్తించారు. గల్లంతైన వారిలో సత్యనారాయణ అనే వ్యక్తి మృత దేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపును కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:సరికొత్త సైబర్ ‌ఎత్తుగడలు.. యువతులతో ఫోన్లు చేయిస్తున్న నేరస్థులు

ABOUT THE AUTHOR

...view details