కృష్ణ జింకను విక్రయించిన ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాట గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి.... గ్రామంలోని పొలాల వద్దకు వచ్చే వన్యప్రాణులను బంధించి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో బోధన్‌కు చెందిన జుబేర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 10 వన్య ప్రాణులను చంపి వాటి మాంసాన్ని విక్రయించారు.
కృష్ణజింకను బంధించి.. విక్రయిస్తున్న ముఠా అరెస్టు - cp anjani kumar latest news
కృష్ణజింక అపహరణ కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. బోధన్‌కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పొలాలకు వచ్చి వన్యప్రాణులను పట్టుకుని విక్రయిస్తుండగా... పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన సల్మాన్ కొన్ని రోజుల క్రితం జుబేర్‌తో కలిసి నిర్మల్ జిల్లాకు వెళ్లాడు. అప్పటికే రెండు జింకలను బంధించి పెట్టిన శంకర్‌తో బేరం కుదుర్చుకున్నాడు. బతికి ఉన్న కృష్ణ జింకను సల్మాన్‌కు 15వేల రూపాయలకు విక్రయించాడు. మరో జింకను వధించి మాంసాన్ని ఇమ్రాన్ అనే వ్యక్తికి విక్రయించాడు. సల్మాన్... కృష్ణ జింకను అద్దె కారులో ఆసిఫ్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకొచ్చాడు. పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి... సల్మాన్, జుబేర్, శంకర్‌లను అదుపులోకి తీసుకుని జింకను కాపాడారు. బోధన్‌కు చెందిన ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కృష్ణ జింకను క్షేమంగా జూ అధికారులకు అప్పగించారు. కృష్ణ జింకను వేటాడితే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుందని పోలీసులు హెచ్చరించారు. కృష్ణ జింకను విక్రయించిన నిర్మల్ జిల్లా చాట గ్రామానికి చెందిన శంకర్‌పై గతంలోనూ వన్యప్రాణుల విక్రయం కేసులున్నట్లు వెల్లడించారు.