తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యార్థులు, యువతే టార్గెట్.. జోరుగా మత్తు ఇంజెక్షన్ల అమ్మకం - illegal sales of Pentazocine lactate injections

Pentazocine lactate injections illegal sales: ఏపీలోని విశాఖపట్నంలో మత్తు ఇంజెక్షన్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. వారంలో రెండోసారి మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నారు పోలీసులు. పశ్చిమబంగా నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి.. లీలామహల్ జంక్షన్​లో విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో నిఘా పెట్టిన వారు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Pentazocine lactate injections illegal sales
Pentazocine lactate injections illegal sales

By

Published : May 9, 2022, 11:49 AM IST

illegal sales of Pentazocine lactate injections: శస్త్రచికిత్సల్లో నొప్పిని నివారించే పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు అక్రమంగా అమ్ముతున్న నిందితులను.. విశాఖ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 వేల ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖరగ్​పూర్‌లో ఒక బాక్సు ఇంజెక్షన్లు రూ.1300కు కొనుగోలు చేసి, విశాఖపట్నంలో రూ.2వేలకు అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.

విశాఖలో విద్యార్థులు, యువత మత్తు మందులకు అలవాటు పడుతున్నారని, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఇంజెక్షన్ల దందా సాగుతోందని.. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. పశ్చిమబెంగాల్ నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి లీలామహల్ జంక్షన్​లో విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టినట్లు చెప్పారు. పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన అనుపమ అధికారి, కౌశిక్ చౌధురి అనే ఇద్దరితో పాటు.. భీమిలిలో ఇంజెక్షన్లు కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details