తెలంగాణ

telangana

ETV Bharat / crime

'భూమి విక్రయిస్తామని నకిలీ పత్రాలు సృష్టించి.. రూ.7కోట్లు వసూలు' - తెలంగాణ వార్తలు

బంజారాహిల్స్‌లో తొమ్మిది ఎకరాలకు పైగా భూమి తమదేనంటూ నకిలీ పత్రాలు సృష్టించారు ఆ ముగ్గురు. రెండు ఎకరాలు అమ్ముతామంటూ ఓ వ్యక్తి నుంచి రూ.7 కోట్లు వసూలు చేశారు. భూమిని అప్పజెప్పే విషయంలో అసలు విషయం బయటపడింది.

three-accused-arrest-by-ccs-police-due-to-fake-land-papers-at-banjara-hills-in-hyderabad
'భూమి విక్రయిస్తామని నకిలీ పత్రాలు సృష్టించి.. రూ.7కోట్లు వసూలు'

By

Published : Mar 23, 2021, 5:43 PM IST

భూమి విక్రయిస్తామంటూ నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 12లో ఉన్న 9 ఎకరాలకు పైగా భూమి తమదేనంటూ తిరుమల రాంచందర్ రావు, సంపత్, అవినాష్ నకిలీ పత్రాలు సృష్టించారు. ఇందులో 2 ఎకరాల భూమిని విక్రయిస్తామని మిహిరా బిల్డ్ కంపెనీ యజమాని సుఖేశ్ రెడ్డిని నమ్మించారు. ఆయన నుంచి గతేడాది జూలైలో రూ.7 కోట్లు వసూలు చేశారు. ఒప్పందం కుదిరిన తర్వాత భూమి అప్పజెప్పే విషయంలో అసలు విషయం బయటపడింది.

నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేశారని బాధితుడు సుఖేశ్ రెడ్డి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... తిరుమల రాంచందర్ రావు, దర్పల్లి సంపత్, తిరుమల అవినాశ్‌లను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాలతో 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: గుర్తు తెలియని మహిళ హత్య.. డ్రైనేజీలో మృతదేహం!

ABOUT THE AUTHOR

...view details