రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోబోయిన దంపతులను చితకబాదిన దొంగలు - thieves beat a couple in nizamabad
దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోబోయిన దంపతులను దొంగలు చితకబాదారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఎల్‌కేపారంలో చోటుచేసుకుంది.
దొంగల బీభత్సం
దొంగతనం చేస్తుండగా పట్టుకోబోయిన భార్యభర్తలను చితకబాదిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. నవీపేట మండలం ఎల్‌కే పారంలో మూడు ఇళ్లలో చోరికి దొంగలు విపలయత్నం చేశారు. ఈక్రమంలో ఒకఇంటిలో దొంగతనం చేస్తుండగా పట్టుకోబోయిన సంతోషమ్మ, సత్యనారాయణ అనే దంపతులను చితకబాదారు. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్ రావు, ఎస్సై పరిశీలించారు.