కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చోరికి యత్నించిన దొంగను స్థానికులు పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేశారు. వారి దెబ్బలకు తాళలేక దొంగ ప్రాణాలు వదిలేశాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చిన్న మల్లారెడ్డిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
Thief Killed by Villagers: స్థానికుల దాడిలో చోరీకి యత్నించిన దొంగ మృతి - thief killed in kamareddy
10:07 December 07
స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన దొంగ
ఇదీ జరిగింది...
ఓ వ్యక్తి ట్రాక్టర్ను దొంగిలించేందుకు వెళ్లాడు. గమనించిన స్థానికులు అతనిని చుట్టుముట్టారు. దొంగకు దేహశుద్ధి చేశారు. స్థానికులు దాడిలో తీవ్రంగా గాయపడిన దొంగ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే దొంగ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా దొంగను పట్టుకున్న స్థానికులు.. పోలీసులకు అతనిని అప్పగించాల్సింది. కానీ చట్టాన్ని వారే చేతిలోకి తీసుకుని దొంగ మృతికి కారణమయ్యారు. అతనిని బంధించి పోలీసులకు అప్పగించినా.. దొంగ ప్రాణాలు దక్కేవి.
ఇదీ చూడండి: