తెలంగాణ

telangana

ETV Bharat / crime

అక్షింతలు వేసి వచ్చేలోపే.. 65 సవర్ల బంగారం చోరీ - గుంటూరులో 65 సవర్ల బంగారం చోరీ

Gold Theft in Marriage: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా అరండల్​పేట స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ కల్యాణ మండపంలో 19వ తేదీ రాత్రి వివాహం జరిగింది. వెంకటకృష్ణ అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న బంగారం బ్యాగులో పెట్టుకొని వివాహానికి వచ్చాడు. తన బ్యాగ్​ను కుర్చీలో పెట్టి.. అక్షింతలు వేసేందుకు వెళ్లాడు.. తిరిగి వచ్చి చూసేసరికి బ్యాగ్​ మాయమైంది. దీంతో లబోదిబోమనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Theft in Marriage
గుంటూరులో బంగారం చోరీ

By

Published : Dec 20, 2022, 5:30 PM IST

Gold Theft in Marriage: ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లాలోని ప్రియ గార్డెన్స్ కల్యాణ మండపంలో 19వ తేదీ రాత్రి వివాహం జరిగింది. వేమూరుకు చెందిన కొమ్మూరు వెంకటకృష్ణ ఇంట్లో ఉన్న బంగారం బ్యాగులో పెట్టుకొని వివాహానికి వచ్చాడు. అక్షింతలు వేసేందుకు బ్యాగుని కుర్చీలో వదిలి.. వేదిక పైకి వెళ్ళాడు. అక్షింతలు వేసి వచ్చి చూడగా బ్యాగ్ కనిపించలేదు.

దానిలో సుమారు 65 సవర్ల బంగారం ఆభరణాలు ఉన్నాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన బంగారం విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని వెంకట కృష్ణ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో బ్యాగ్ తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

అక్షింతలు వేసి వచ్చేలోపే.. 65 సవర్ల బంగారం చోరీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details