తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యుదాఘాతంతో యువకుడు మృతి - తెలంగాణ వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం గ్రామంలో యువకుడు మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మరణించాడు. ఈ ఘటనలో మృతుడి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు.

కరెంట్ షాక్​తో యువకుడు మృతి, విద్యుదాఘాతంతో యువకుడు మృతి

By

Published : May 1, 2021, 3:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. పొలంలో వరి పంటను కోసే యంత్రానికి విద్యుత్ తీగలు అడ్డు రాగా... మృతుడు శివ తీగలను కర్రతో పక్కకు జరిపి ప్రయత్నం చేశాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు.

వెంటనే స్థానికులు అప్రమత్తమై శివను జిల్లా ఆస్పత్రికి తరలించగా… అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో మృతుడి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు.

ఇదీ చదవండి:కాచిగూడలో దారుణం.. గ్రానైట్ రాయితో మోది హత్య!

ABOUT THE AUTHOR

...view details