తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడికి బడితెపూజ - headmaster in laidam news

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పెడదారి పట్టాడు. తన వద్ద చదువుకునే ఆడపిల్లలతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. చివరికి దెబ్బలు తిన్నాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలో ఈ ఘటన జరిగింది.

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి
విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి

By

Published : Mar 6, 2021, 5:23 PM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ.. గ్రామస్థుల చేతిలో దెబ్బలు తిన్నారు. తమతో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటూ.. ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఉదయం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని చితకబాదారు. పలుమార్లు హెచ్చరించినా... ఆయన ప్రవర్తనలో మార్పు లేదని అందుకే బుద్ధి చెప్పామని... గ్రామస్థులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి

ఇదీ చదవండి:మంత్రి కేటీఆర్‌ పీఏ పేరుతో మోసాలు.. లక్షల్లో వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details