తెలంగాణ

telangana

ETV Bharat / crime

CYBER CRIME: ఒకే ఒక్క వాట్సాప్‌ మెసేజ్‌.. రూ.40 లక్షలు స్వాహా

వాట్సాప్​లో వచ్చిన ఆ ఒక్క మెసేజ్​.. అతని జీవితాన్నే మార్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. అసలు ఆ మెసేజ్ ఏంటీ? డబ్బులు ఎలా పోయాయి. అతనేం చేశాడు.. ఓసారి కింది కథనం చదివి తెలుసుకుందాం.

CYBER CRIME
CYBER CRIME: ఒకే ఒక్క వాట్సాప్‌ మెసేజ్‌.. రూ.40 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు

By

Published : Aug 5, 2021, 9:45 AM IST

Updated : Aug 5, 2021, 10:27 AM IST

ఒకే ఒక్క వాట్సాప్‌ మెసేజ్‌.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.40 లక్షలు పోగొట్టుకునేలా చేసింది. బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

శేరిలింగంపల్లికి చెందిన బాధితుడికి(38) వాట్సాప్‌లో +447901695636(లిండా) అనే నంబర్‌ నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌ చేస్తే లాభాలే.. లాభాలంటూ వివరించారు. ఆసక్తి ఉందని బాధితుడు రిప్లై ఇవ్వడంతో.. వెబ్‌సైట్‌ (ప్లాట్‌ఫాం)కు సంబంధించిన లింక్‌ను పంపించారు. రూ.50 వేలు అక్కడ రీఛార్జ్‌ (ఇన్వెస్ట్‌) చేశాడు. రూ.12 వేలు లాభం వచ్చింది. మరో బ్యాంక్‌ ఖాతా నంబర్‌ ఇచ్చి రూ.5 లక్షలు రీఛార్జ్‌ చేయమన్నారు. ఎందుకని అడిగితే.. బ్యాకప్‌ అంటూ సమాధానమిచ్చారు. అప్పుడు మరో రూ.50 వేలు లాభం వచ్చింది. బాధితుడు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకున్నాడు. నమ్మకం పెరిగింది. స్నేహితుల దగ్గర అప్పు, పర్సనల్‌ లోన్స్‌ తీసుకుని గత నెల 19 నుంచి 26 వరకు రూ.40 లక్షలను ‘లార్డ్‌ బుద్ధ సర్వీసెస్‌’ పేరిట ఉన్న బ్యాంక్‌ ఖాతాలో జమ చేశాడు.

ఒక్కసారిగా పెట్టుబడి, లాభం కలిపి రూ.2 కోట్లకు చేరుకున్నట్లు ఆ వెబ్‌సైట్‌లో చూపించింది. తీరా విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. సాంకేతిక కారణాలతో ఇప్పుడు అవకాశం లేదంటూ సదరు వ్యక్తులు నమ్మించారు. కొన్ని రోజులు తర్వాత ఆ వెబ్‌సైట్‌ కనిపించలేదు. వాళ్ల ఫోన్‌ నంబర్లు పనిచేయక పోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు.

ఇదీచూడండి:కొవిడ్​ మరణాల లెక్కలపై కేంద్రం క్లారిటీ

Last Updated : Aug 5, 2021, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details