Boyaguda Fire Accident: బీహార్‌కు చెందిన 11 మంది కార్మికులను బలి తీసుకున్న ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని పోలీసులు తేల్చారు. సికింద్రాబాద్ బోయిగూడ తుక్కు గోదాంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
Boyaguda Fire Accident: బోయిగూడ ప్రమాదానికి కారణమదే.. పోలీసుల దర్యాప్తులో వెల్లడి
Boyaguda Fire Accident: సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. తుక్కు గోదాంలో జరిగిన ప్రమాదంలో బీహార్‌కు చెందిన 11 మంది కార్మికులు మృతి చెందారు.
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా మరోసారి ఆధారాలు సేకరించింది. ఫ్యూజ్ బాక్సు ఎక్కువ సంఖ్యలో వైర్లు అమర్చడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ సేకరించిన అధారాలతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: