ఓ 17 ఏండ్ల మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా లట్టుపల్లి గ్రామానికి చెందిన బి. సౌమ్య ఎస్ఎస్సీ పూర్తి చేసి... ఇంటర్లో చేరేందుకు హైదరాబాద్ వచ్చింది. హిమాయత్ నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉండే ఆ యువతి ఈ నెల 28న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో బంధువులు ఆమె తండ్రి మహేష్‌కు సమాచారం ఇచ్చారు.
మైనర్ బాలిక అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు - telangana news
ఓ మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మైనర్ బాలిక అదృశ్యం
నగరానికి చేరుకున్న యువతి తండ్రి నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే బస్తీలో ఉండే రజిని అనే యువతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:పోషించలేక ఐదురోజుల శిశువును అమ్మేసింది!