తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి - telangana news

ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హామీ ఇచ్చారు.

The incident took place in Dubbaka mandal of Siddipet district where a man fell into a pond and died.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

By

Published : Feb 27, 2021, 4:54 PM IST

ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లిలో జరిగింది. పంజా కిషన్ అనే వ్యక్తి చెరువులో పడగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

ABOUT THE AUTHOR

...view details