తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యుదాఘాతానికి 8 మూగజీవాలు బలి - Cows died

మేతకు వెళ్లిన ఎనిమిది పశువులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన నిర్మల్ రూరల్ మండలంలో చోటు చేసుకుంది.

electrocution
electrocution

By

Published : Jun 7, 2021, 9:13 PM IST

నిర్మల్​ మండలంలో విషాదం జరిగింది. ఉదయం మేతకు వెళ్లిన ఎనిమిది పశువులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాయి. మూగ జీవాల విలువ సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు వాపోయారు. తెగి పడ్డ విద్యుత్ తీగల వల్లే ప్రమాదం సంభవించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటనా స్థలాన్ని లైన్ ఇన్స్పెక్టర్, పశు వైద్యాధికారులు సందర్శించి.. వారిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధిత రైతులు వారికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ఆలయ భూముల్లో అక్రమ కట్టడాల అడ్డగింత

ABOUT THE AUTHOR

...view details