Hanamkonda Road accident: ఈ తెల్లవారుజామున హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. హనుమాన్ జంక్షన్ వద్ద ఆగి ఉన్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Hanamkonda Road accident: ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి - car and bus accident in hanamkonda
Hanamkonda Road accident: హనుమకొండలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
హనుమకొండలో రోడ్డు ప్రమాదం
దామెర మీదుగా వరంగల్‌కు వస్తున్న కారు... హనుమాన్ జంక్షన్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. గాయపడ్డ వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... క్రేన్ సహాయంతో కారును తొలగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
ఇదీ చదవండి:Minister Vehicle Accident: బైక్‌ను ఢీకొట్టిన మంత్రి వాహనం.. ఒకరు మృతి