తెలంగాణ

telangana

ETV Bharat / crime

Notice : అధిక ఫీజు వసూల్ చేస్తున్న ఆస్పత్రికి నోటీసులు - government notice to ankam hospital

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంకం ప్రైవేట్ ఆస్పత్రికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కరోనా చికిత్సకు అధిక ఫీజు వసూల్ చేస్తున్నారన్న ఫిర్యాదుపై స్పందించి చర్యలు తీసుకుంది.

ankam hospital, ankam hospital in nizamabad
అంకం ఆస్పత్రి, నిజామాబాద్​లో అంకం ఆస్పత్రి, అంకం ఆస్పత్రిపై చర్యలు

By

Published : May 29, 2021, 3:13 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ చికిత్సల ఫిర్యాదుల నేపథ్యంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కరోనా చికిత్సకు అధిక ఫీజు వసూల్ చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు నిజామాబాద్ నగరంలోని అంకం ఆస్పత్రికి నోటీసులు జారీ చేసింది.

24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు వివరణ పంపినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా బాధితులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు హెచ్చరికలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details