తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drunken Teacher Beat Students: మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు - SIDDIPET DRUNKEN TEACHER NEWS

Drunken Teacher Beat Students: చెంపలు, తొడలపై రక్తపు గాట్లతో ఇంటికి వచ్చిన పిల్లలను చూసిన తల్లిదండ్రులు ఎవరితో గొడవపడ్డారంటూ అడిగారు. తాగి వచ్చిన ఉపాధ్యాయుడే తమను గాయపరిచారని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు.

Drunken Teacher Beat Students
మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు

By

Published : Dec 11, 2021, 12:24 PM IST

Drunken Teacher Beat Students: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చి విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తించే సంజీవరెడ్డి 12 మంది విద్యార్థులను చితకబాదాడు.

విద్యార్థులను చితకబాదడంతో పాటు చెంపలు, తొడలపై రక్తం వచ్చేలా గిచ్చాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థులను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీశారు. ఉపాధ్యాయుడు కొట్టారని చెప్పడంతో.. తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మండల విద్యాధికారి ప్రభుదాస్ పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఉపాధ్యాయుడు సంజీవరెడ్డిని విధుల్లోంచి తొలగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేయగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హమీ ఇచ్చారు. విద్యార్థులను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు.

మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు

ఇదీ చూడండి:missing boys found alive : అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం.. అసలేమైందంటే?

ABOUT THE AUTHOR

...view details